ఆర్ఎంపీ వైద్యం...బాలింత మృతి - నెల్లూరు వార్తలు
11:10 May 01
ఆర్ఎంపీ వైద్యం...బాలింత మృతి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో బాలింత మృతి చెందింది. బాలింత వెంకటమ్మకి కృష్ణాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేశాడు. పరిస్థితి విషమించటంతో నెల్లూరుకు తరలిస్తుండగా బాలింత మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే బాలింత మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. గత నెల 7న ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత వెంకటమ్మ ప్రసవించింది. రెండు నెలల క్రితం మర్రిపాడు మండలంలోని ఆర్ఎంపీ వైద్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారులకు నోటీసులు ఇచ్చినా ఆర్ఎంపీలు యథేచ్ఛగా వైద్యం చేస్తున్నారు.
ఇవీ చదవండి...లాటరీ పేరుతో రూ.46లక్షల టోకరా