నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌ను 2007 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మొత్తం 4500 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించి ఏపీఐఐసీ అధికారులకు అప్పగించారు. మేనకూరు పంచాయతీ కోనేటిరాజుపాలెం రైతులు 300 ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చారు. సర్వే నెంబర్లు 22-1, 37 , 40-18, 43-21 లో ఉన్న గ్రామానికి సంబంధించిన భూములను ఏపీఐఐసీ పరిధిలోకి వచ్చేలా రెవిన్యూ అధికారులు నమోదు చేశారు. సదరు సర్వే నెంబర్లు ఉన్న భూముల విషయంలో పొరపాటు జరిగిందని ఏపీఐఐసీ అధికారులే చెబుతున్నా...రెవెన్యూ అధికారులు స్పందించటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పులు...గ్రామస్తులకు తిప్పలు ! - Revenue officials'
రెవెన్యూ అధికారుల తప్పిదంతో నెల్లూరు జిల్లా మేనకూరు గ్రామ పంచాయతీ కోనేటిరాజుపాలెం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన స్థలాలను ఏపీఐఐసీ పరిధిలో ఉన్నట్టుగా రెవెన్యూ అధికారులు రికార్డులలో నమోదు చేయటంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

గ్రామస్తులకు తిప్పలు
రెవిన్యూ అధికారుల తప్పులు...గ్రామస్తులకు తిప్పలు
ఇదీ చదవండి..సీఎంతో చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ భేటీ