నెల్లూరు జిల్లా అప్పారావుపాళెంలో అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు.. వారి రేషన్ కార్డులు తొలగించారని.. బాధితులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గత నెల రేషన్ తీసుకున్నామని.. ఈనెల తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు తొలగించారని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ధన్యాసి శశిఖళ.. వార్డు అభ్యర్థిగా ధన్యాసి పెంచలమ్మ పోటీ చేశారు.
సర్పంచ్, వార్డు అభ్యర్థుల రేషన్ కార్డులు తొలగింపు..! - నెల్లూరు జిల్లా వార్తలు
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు.. సర్పంచి అభ్యర్థి, వార్డు అభ్యర్థి రేషన్ కార్డులు తొలగించారని.. తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.
గతంలో పోటీనుంచి తప్పుకోవాలని బెదిరింపులు మొదలుపెట్టారు. అధికార పార్టీ నాయకుల మాట వినకుండ పోటీలో నిలవడంతో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి.. రేషన్ కార్డులు తొలగించారని ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయకుంటే అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారని వాపోయారు. ఎవరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు రావని భయపెడుతున్నారన్నారు. గతంలో కేటాయించిన ఇళ్ల పట్టాలు సైతం ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి:బిడ్డకు పాలిస్తుండగా.. అమ్మ స్తనంపై పాముకాటు
TAGGED:
నెల్లూరు జిల్లా వార్తలు