నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్కెట్ విలువలు, ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం సందర్శించారు. కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల దస్తావేజులను తనిఖీ చేశారు. ఉదయగిరి పరిధిలో జూన్ వరకు రూ. 105.66 లక్షల ఆదాయం లక్ష్యం కాగా రూ. 28.22 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. కరోనా ప్రభావంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఆస్తులు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు ఈసీలు, నకళ్లు పరిశీలించుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని అబ్రహం.. ప్రజలకు సూచించారు. ఆస్తులు విక్రయించే వ్యక్తి గుణగణాలను తెలుసుకుని క్రయవిక్రయాలు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల విధానంలో సమస్య ఉంటే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలన్నారు. స్థానికంగా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.