కరోనా కేసు నమోదుతో రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారని నెల్లూరు జిల్లా గూడూరు ప్రజలు ఆరోపించారు. కోయంబేడు ప్రభావంతో గూడూరులో వరుసగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా.. పట్టణంలోని కోతరము వీధిని రెడ్ జోన్‌గా ప్రకటించారు.
నాటి నుంచి తమకు సరకులు, కూరగాయలు ఏవీ అందుబాటులో లేవని అక్కడి ప్రజలు వాపోయారు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని.. తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పసిపిల్లలకు పాలు, మందులు దొరక్క అవస్థలు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు.