శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోరీ చేసిన బాలుడిని పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో నివాసం ఉండే మొలకల పూడి కృష్ణారెడ్డి ఇంట్లో 12 సవర్ల బంగారం, లక్ష రూపాయలు నగదు చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. వెంటనే వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సుమారు 12 సవర్ల బంగారు ఆభరణాలు, 70 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన బాలుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని తెలిపారు. ఇప్పటికే అతనిపై పది చోరీ కేసులున్నాయని అన్నారు. నిందితుడిని జువైనల్ హోమ్ కి తరలిస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. కేసును త్వరగా పరిష్కరించేందుకు సహకరించిన సిబ్బందిని అభినందించారు.
24గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు - athmakur in nellore district
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఓ చోరీ కేసును ఛేదించారు. పట్టణంలో పట్టపగలు జరిగిన చోరీ కేసులో నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
![24గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు money, gold recovery by police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9110237-812-9110237-1602235438186.jpg)
బంగారం, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు