ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిషత్ పోరు: బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన ఏజెంట్లు ! - పోనుగోడులో ఉద్రిక్తత

నెల్లూరు జిల్లా పోనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భాజపా, వైకాపా ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఏజెంట్లు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లి నీళ్ల తొట్టిలో పడేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.

re poling in ponugodu parishad elections
బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన ఏజెంట్లు

By

Published : Apr 8, 2021, 4:33 PM IST

బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన ఏజెంట్లు

నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం పోనుగోడు గ్రామంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భాజపా, వైకాపా ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వృద్ధురాలి ఓటు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలంగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన ఏజెంట్లు పక్కనే ఉన్న నీళ్ల తొట్టిలో పడేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details