ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధితుల్లో ధైర్యం పెంచేలా ఆస్పత్రిలో కార్యక్రమాలు'

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రాంతీయ ఆస్పత్రిలో.. ఆర్డీఓ చైత్ర వర్షిణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆహారం, ఆస్పత్రిలోని పరిశుభ్రతపై ఆరా తీశారు.

inspections
కొవిడ్​ ఆస్పత్రిలో తనిఖీలు

By

Published : May 17, 2021, 12:02 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఏరియా ఆస్పత్రిలో.. ఆర్డీఓ చైత్ర వర్షిణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ రోగులతో మాట్లాడి.. వారికి అందిస్తున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందించే పౌష్టికాహారం, ఆస్పత్రి ప్రాంగణంలో శానిటైజేషన్​, పరిశుభ్రతపై ఆరా తీశారు. ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ వల్ల ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు.

కొవిడ్​ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యం, ఆత్మ విశ్వాసం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పట్టణంలోని ఆస్పత్రులు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇకపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి, టిడ్కో కేర్​ సెంటర్లకు అవసరమైన ఎంఎన్ఓల ప్రక్రియపై దృష్టిసారించినట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని కొవిడ్​ పరిస్థితులపై మంత్రి గౌతమ్​రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కొవిడ్​ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details