రైతులకు నష్టం కలుగకుండా పసుపు కొనుగోళ్లు తిరిగి ప్రారంభించాలని ఆర్డీవో ఉమాదేవి మార్క్ఫెడ్జిల్లా మేనేజర్ సుజాత, వ్యవసాయ మార్కెట్ అధికారులు, స్థానిక వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవోను పసుపు రైతుల కలిసి తమ సమస్యలను విన్నవించారు. వెంటనే స్పందించిన ఆమె అధికారులను పిలిచి మాట్లాడారు. రైతులకు నష్టం కలగకుండా ఆగిన పసుపు కొనుగోళ్లను తిరిగి ప్రారంభించాలన్నారు.
పసుపు రైతులకు న్యాయం చేయండి : ఆర్డీఓ
ఉదయగిరి ప్రాంతంలో పసుపు రైతులకు న్యాయం చేయాలని ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. సోమవారం నుంచి పసుపు కొనుగోళ్లను ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.
రైతులు మార్క్ఫెడ్ అధికారులకు సహకరించి పసుపు కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలని అన్నారు. పసుపు నాణ్యతా నిర్ధరణ అధికారులను పిలిపించి.. ప్రస్తుతం గోదాములో నిల్వ ఉన్న పసుపు దిగుబడిని కొనుగోలు చేయాలన్నారు. అనంతరం ఇళ్ల వద్ద నిల్వ చేసుకున్న రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం నుంచి పసుపు కొనుగోళ్లను ప్రారంభిస్తామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ సుజాత తెలపడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆర్డీవో ప్రధానమంత్రి జన వికాస్ యోజన పథకంలో భాగంగా ఉదయగిరిలో ఏర్పాటు చేయనున్న మైనార్టీ వసతి గృహం, పాలిటెక్నిక్ కళాశాల, కామన్ సర్వీస్ కేంద్రాల కోసం గంగి రెడ్డి పల్లి గ్రామం వద్ద కేటాయించిన 36 ఎకరాల భూమిని పరిశీలించారు.
ఇది చదవండి'కువైట్లో బతకలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని ఇంటికి చేర్చండి'