ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి' - Nellore Rural News

ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే డీలర్ల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యునైటెడ్ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

నెల్లూరులో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశం
నెల్లూరులో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశం

By

Published : Jan 22, 2021, 5:22 PM IST

నెల్లూరులో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర నాయకులతో పాటు రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డీలర్లకు కమిషన్​తోపాటు గౌరవ వేతనం అందివ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. తాము అవినీతిపరులంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు చిత్రీకరించడం బాధాకరమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు ఆందోళన వ్యక్తం చేశారు. డోర్ డెలివరీ విధానం ప్రారంభానికి ముందే రేషన్ కార్డుల బైఫరికేషన్ చేసి, డీలర్లందరికీ సమ న్యాయం చేయాల్సిన కోరారు. గని బ్యాగులను తిరిగి తీసుకునే జీఓను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ డీలర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఉద్యమిస్తామని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details