నెల్లూరు జిల్లా గూడూరులో చౌకదుకాణం నడుపుతున్న గౌస్ బాషా కుటుంబానికి రేషన్ డీలర్ల సంఘం తరపున రూ. 3 లక్షల విలువగల చెక్కును అందజేశారు. గత 4 నెలలుగా ప్రభుత్వం నుంచి రేషన్ డీలర్లకు కమిషన్ అందలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు.
అందువల్ల అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.