రాష్ట్రంలో రేషన్ డీలర్లకు రావాల్సిన రూపాయలు 170 కోట్ల కమీషన్ను వెంటనే ఇవ్వాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీలర్లకు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని శాసనసభలో చెప్పిన ముఖ్యమంత్రి.. సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వం సరకులను వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పడం బాగానే ఉందని... అయితే డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించినప్పుడే ఆ పని చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. అలా కాకుండా వాలంటీర్లతోనే పంపిణీ చేస్తే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కరోనాతో చనిపోయిన రేషన్ డీలర్లకు 25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.