ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కావలిలో వైభవంగా రథసప్తమి వేడుకలు - kavali latest news

నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఒకే రోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉన్న కారణంగా... భక్తులు వేలాదిగా తరలి వెళ్లారు.

rathasaptami vedukalu at kavali in nellore district
కావలిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

By

Published : Feb 19, 2021, 1:04 PM IST

కావలిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం బృందావనం కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారు సూర్యప్రభవాహనంపై విహరిస్తూ.. పడమర నుంచి తూర్పు వీధి కలిసే ప్రాంతానికి చేరుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని సూర్య కిరణాలు తాకిన తరువాత.. అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేధ్యాలు సమర్పించి వాహన సేవలు ప్రారంభించారు. ఒకేరోజున ఏడు వాహన సేవలు దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details