ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ....,నెల్లూరు జిల్లాలో వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో రీసర్వే నిర్వహించి.....సుమారు వందేళ్లు కావస్తోంది. 30 ఏళ్లకు ఒకసారి సర్వే చేయాల్సి ఉన్నా.......అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే వందేళ్ల వరకూ శాశ్వత భూహక్కు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో....ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రక్రియ మొదలైంది. కరోనా సహా ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైనా మళ్లీ మొదలైంది.
నెల్లూరు జిల్లాలో 12 వందల గ్రామాల్లోని 4 లక్షల 56 వేల సర్వే నెంబర్లలో...13 లక్షల 16 వేల 144 హెక్టార్లలో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం....,నెల్లూరు జిల్లాకు 90కోట్ల రూపాయలు కేటాయించారు. 4 దశల్లో పూర్తి చేయాలని భావిస్తుండగా.....ప్రతి మండలంలో ఐదు గ్రామాల్లో డ్రోన్‌ల సాయంతో సర్వే చేస్తున్నారు. ఒక్కో డ్రోన్..రోజుకు 60 ఎకరాల్లో సర్వే చేస్తుంది.