Attempted rape of a girl: నెల్లూరు జిల్లా తెలుగు గంగ కాలనీ వద్ద ఓవెల్ స్కూల్లో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల స్కూల్లో పీఆర్వో పని చేసే బ్రహ్మయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజులుగా బాలికను తరగతి గదుల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బ్రహ్మయ్య బాలికను బెదిరించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంట్లో భాగంగా బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లితండ్రులు గుర్తించి విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్రహ్మయ్యను అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలోను బ్రహ్మయ్య పైన లైంగిక ఆరోపణలు ఉన్నట్లుగా తెలిసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బ్రహ్మయ్యను శిక్షించాలని స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం - Harassment of children at school
Attempted rape of a girl: పాఠశాలలో చదివే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. చదువుకునేెందుకు పాఠశాలకు వెళ్లే పసి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు ఓ కామాంధుడు ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది.
child harasment