పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. దాత విజయకుమార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. దాదాపు రెండు వందల మంది ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు. కులమతాలకు అతీతంగా ముఖ్య పండుగల సమయంలో విజయకుమార్ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ, పేదలకు చేయూతనందిస్తున్నారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఆయన్ను కొనియాడారు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన దాత - పేద ముస్లిలకు రంజాన్ తోఫా అందించిన నెల్లూరు జిల్లా దాత
రంజాన్ పండుగను పురస్కరించుకుని కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో పేద ముస్లింలకు ఓ దాత కొత్త దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపు 200 మంది ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు.
![పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన దాత ramzan thofa given to poor muslims by donor vijyakumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7335186-1045-7335186-1590379862601.jpg)
పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేందుకు ముందుకొచ్చిన దాత
TAGGED:
nellore district latest news