నెల్లూరులో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ముస్లింలు చేస్తోన్న రిలే దీక్షకు మద్ధతుగా తెదేపా భారీ ర్యాలీ చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. తెదేపా నేతలు జాతీయ జెండాలు చేతబట్టి సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
నెల్లూరులో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ
TAGGED:
Nrc Tdp Bhari Rally