నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరటంతో చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలో ఉన్న మగ్గం గుంటల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా పనులు జరగక ఇబ్బందులు పడ్డ తమకు... మూలిగే నక్కపై తాటికాయి పడ్డట్టు భారీ వర్షాలు వచ్చి ఇంకా ఇబ్బందులకు గురిచేసిందని వాపోతున్నారు. మగ్గం గుంటల్లో నీరు రెండు నెలల పాటు ఉంటాయని.. అంతవరకు పనులు జరగక పూట గడిచేందుకు ఇబ్బందులు పడతామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మగ్గం గుంటల్లోకి వర్షపు నీరు... ఆందోళనలో నేతన్నలు
కొన్ని నెలలుగా కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులకు గురైన వారికి... వర్షాలు మరోమారు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల ఇళ్లల్లోని మగ్గం గుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరటంతో నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. తమకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మగ్గం గుంటల్లోకి వర్షపు నీరు... ఆందోళనలో నేతన్నలు