వెంకటగిరిలో వర్షం..ప్రజలకు ఉపశమనం - Rain relief in Venkatagiri
వెంకటగిరిలో ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. లాక్డౌన్ తరుణంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలకు చల్లదనాన్ని కలిగించింది.
వెంకటగిరిలో వర్షంతో ఉపశమనం...!
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పుర ప్రజలకు ఉక్కపోత నుంచి ఊరట లభించింది. కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో సతమతమవుతున్న స్థానికులకు చల్లని వాతావరణం అనందాన్ని కలిగించింది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నియోజకవర్గ పరిధిలో చివరి దశలో పంట నూర్పిడి పనులు సాగిస్తున్న రైతులకు మారిన వాతావరణం వణుకు పుట్టిస్తోంది.