నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో చల్లని వాతావరణం ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం కురిసింది. లాక్డౌన్, ఎండల కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రజలు మారిన వాతావరణంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. అయితే వర్షం కురిసిందని ఆనందంగా ఉన్నా... కరోనా పెచ్చరిల్లుతుందని కొందరిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చిరుజల్లులతో తడిసిన వెంకటగిరి - నెల్లూరులో వర్షం
వెంకటగిరి ప్రాంతంలో మారిన వాతావరణం అందరినీ ఆహ్లాదపరిచింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు రాజ్యమేలుతూ... స్థానికులకు ఆనందాన్నిస్తోంది. అయితే ఇప్పుడు వర్షం పడడం భయాందోళనలకు గురిచేస్తోంది
![చిరుజల్లులతో తడిసిన వెంకటగిరి rain in nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6947841-216-6947841-1587896113650.jpg)
నెల్లూరులో ఆహ్లాద వాతావరణం