నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. మర్రిపాడు, అనంసాగరం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా రైతులు పంటలను నష్టపోయారు. చేతికొచ్చిన మల్బార్, పత్తి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరగటం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటు కారణంగా మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామానికి చెందిన చిన్నయ్య అనే రైతు మృతి చెందాడు. ఆ గ్రామంలో 5 చోట్ల పిడుగులు పడంటతో మస్తానయ్య అనే రైతుకు చెందిన పది పొట్టేళ్లు మృత్యువాత పడ్డాయి. పగలు రాత్రి కష్టపడి పండించిన పంటలు నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆకాల వర్షం కారణంగా అపార నష్టం - nellor
నెల్లూరు జిల్లాలో అకాల వర్షంతో రైతులకు అపార నష్టం సంభవించింది. పిడుగుపాటు కారణంగా మర్రిపాడులో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఆకాల వర్షం కారణంగా అపార నష్టం