ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - నెల్లూరులో పేదలకు రహబర్ ఫౌండేషన్ ఆర్థిక సహయం

నెల్లూరులో రహబర్ ఫౌండేషన్ సహకారంతో, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు చేయూతనందించింది. వీరు రంజాన్​ను పురస్కరించుకొని.. నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ration to poor
నిరుపేదలకు నిత్యావసర సరుకులు

By

Published : Apr 12, 2021, 10:15 AM IST

నెల్లూరులోని రహబర్ ఫౌండేషన్ సహకారంతో, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు అండగా నిలుస్తోంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని.. స్థానికంగా ఉన్న నిరుపేదలకు నిత్యావసర సరకుల పంపిణీ చేశారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ, దాదాపు 300 కుటుంబాలకు బియ్యం, గోధుమపిండి, సేమియతోపాటూ.. 20కేజీల సరకులు అందించారు. పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన తాము, వాటిని కొనసాగిస్తామని.. ఆ సంస్థల నిర్వాహకులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details