ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ నుంచి స్వగ్రామాలకు... 247 మంది మత్స్యకారులు - మత్య్సకారులు

నెల్లూరు జిల్లా గూడూరు క్వారంటైన్​ కేంద్రంలో ఉన్న 247 మంది మత్స్యకారులను అధికారులు వారి స్వగ్రామాలకు తరలించారు. సొంత ఊళ్లకు వెళ్లిన అనంతరం మరో 14 రోజుల పాటు వారిని హోం క్వారంటైన్​లో ఉండాలని సబ్​ కలెక్టర్​ రోణంకి గోపాలకృష్ణ సూచించారు.

క్వారంటైన్‌లో ఉన్న మత్స్యకారులను స్వగ్రామాలకు తరలింపు
క్వారంటైన్‌లో ఉన్న మత్స్యకారులను స్వగ్రామాలకు తరలింపు

By

Published : Apr 12, 2020, 7:04 AM IST

నెల్లూరు జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో 14 రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న 247 మంది మత్స్యకారులను అధికారులు వారి స్వగ్రామాలకు తరలించారు. గత నెల 30న కర్ణాటకలోని మంగళూరు నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన వలస మత్స్యకారులను గూడూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించి మౌలిక సదుపాయాలు కల్పించారు. అనంతరం క్వారంటైన్​ గడువు ముగియటంతో మత్స్యకారులను వారి స్వగ్రామాలకు పంపించారు. స్వగ్రామాలకు వెళ్లాక అక్కడ 14 రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలని సబ్‌ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సూచించారు. క్వారంటైన్‌లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులను ఆయన అభినందించారు.

ఇదీ చూడండి:'నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారికి 28 రోజుల క్వారంటైన్'

ABOUT THE AUTHOR

...view details