ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pushpayagam: కన్నుల పండువగా రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగం - ap latest news

Pushpayagam: నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం.. వైభవంగా జరిగింది. అమ్మవారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆలయాధికారులు పుష్పయాగం నిర్వహించారు. 14ఏళ్లుగా ఈ క్రతువు జరుగుతున్నట్లు ఆలయార్చకులు తెలిపారు.

Pushpayagam at rajarajeshwari temple in nellore
కన్నుల పండువగా రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగం

By

Published : Mar 7, 2022, 11:49 AM IST


Pushpayagam: నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అర్చకులు పుష్పయాగం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజల నడుమ.. అమ్మవారికి 14 రకాల పూలతో పుష్పాభిషేకం చేశారు.

కన్నుల పండువగా రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగం

రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో.. 14 ఏళ్లుగా ఈ పుష్పయాగం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్పాభిషేకాన్ని తిలకించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details