వెంకటగిరిలో ప్రజలకు అవగాహన..బయటకు రావద్దని విజ్ఞప్తి - నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ పై అవగాహన
లాక్డౌన్ పట్ల అధికారులు వెంకటగిరిలో ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద పురపాలక సిబ్బంది మైకులో వివరించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
వెంకటగిరిలో లాక్డౌన్ పై ప్రజలకు అవగాహన
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లాక్డౌన్పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. స్థానిక సీఐ అన్వర్ బాషా మైక్ ద్వారా పుర విధుల్లో తిరిగి సామాజిక దూరం పాటించాలని ప్రజలకు తెలిపారు. వారితో పాటు తహసీల్దార్, పురపాలక కమిషనర్ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు పట్టణంలో 4 చోట్ల కూరగాయలు, పండ్ల దుకాణాలు అందుబాటులో తెచ్చారు. ఈ దుకాణాల వద్ద పురపాలక సిబ్బంది నిర్ణీత ధరలు మైకులో వివరించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అయితే ప్రజలు ఎక్కడా సామాజిక దూరం పాటించడం లేదు.