ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్​ఎల్​వీ- సీ 50 - నెల్లూరు జిల్లా సమాచారం

శ్రీహరికోటలోని సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​ నుంచి నేడు పీఎస్​ఎల్​వీ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన కౌంట్​డౌన్​ ప్రక్రియ బుధవారమే ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ... ఇంటర్​ నెట్​ సేవలు విస్తృతమయ్యే అవకాశముంది.

rocket launching
నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్​ఎల్​వీ వాహన నౌక

By

Published : Dec 17, 2020, 2:15 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ. 1993లో తొలి ప్రయోగం జరిగిన దీనిద్వారా ఇప్పటికి 374 ఉపగ్రహాలు (46 స్వదేశీ, 328 విదేశీ) విజయవంతంగా కక్ష్యలోకి చేరాయి. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-1, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌, స్పేస్‌ క్యాప్సూల్‌ రికవరీ ప్రయోగం, ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ తదితరాలన్నీ ఈ వాహకనౌక ద్వారానే ప్రయోగించారు. 1970-80లో శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ) ద్వారా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిన ఇస్రో.. తర్వాత ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఏఎస్‌ఎల్‌వీ)ని నిర్మించి వినియోగించింది. ఈ రెండూ ప్రపంచ యవనికపై భారత ఉనికిని చాటినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో 1990-2000 మధ్యకాలంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మూడోతరం కింద నిర్మించారు.

వైఫల్యం నుంచి విజయం వైపు..

1993 సెప్టెంబరు 20న పీఎస్‌ఎల్‌వీ-జి వాహకనౌక ద్వారా పీఎస్‌ఎల్‌వీ-డి1 ప్రయోగాన్ని చేపట్టగా, అది విఫలమైంది. తర్వాత 1994, 1996లో పీఎస్‌ఎల్‌వీ-డి2, డి3 ప్రయోగాలు చేయగా.. ఆ రెండూ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత నుంచీ ‘సి’ సిరీస్‌ ప్రయోగాలు మొదలయ్యాయి. 1997 సెప్టెంబరు 29న పీఎస్‌ఎల్‌వీ-సి1 ప్రయోగం జరగ్గా.. ఐఆర్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి పంపించారు. ఇక వరుసగా ప్రయోగాలు జరిగాయి. పీఎస్‌ఎల్‌వీ-సి13 ప్రయోగం ఒక్కటే జరగలేదు.

ఉపగ్రహాలను మోసుకెళ్లడం

* 1999 నుంచి ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 328 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.

ఇదీ చదవండి : 'ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి'

ABOUT THE AUTHOR

...view details