ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో నింగిలోకి పీఎస్​ఎల్​వీ-సి47 - pslv c47 launch from sriharikota ap

మరికొద్ది సేపట్లో పీఎస్​ఎల్​వీ -సి47 నింగిలోకి దూసుకుపోనుంది. 16 వందల 25 కిలోల కార్టోశాట్​తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి వాహకనౌక మోసుకుపోనుంది. ఈ ప్రయోగం కౌంట్​డౌన్ మంగళవారం నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది.

pslv c47 launch from sriharikota ap
నేడు నింగిలోకి పీఎస్​ఎల్​వీ-సి47

By

Published : Nov 27, 2019, 5:42 AM IST

Updated : Nov 27, 2019, 8:38 AM IST

నేడు నింగిలోకి పీఎస్​ఎల్​వీ-సి47

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..... మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను పీఎస్​ఎల్​వీ- సి47 వాహకనౌక నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి మంగళవారం ఉదయం 7 గంటల 28 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మూడో తరానికి చెందిన హై రెజల్యూషన్‌ ఎర్త్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. దీని జీవిత కాలం ఐదేళ్లు. కార్టోశాట్-3 బరువు సుమారు 16 వందల 25 కిలోలు. పట్టణ అభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగంలో ఈ ఉపగ్రహం సేవలందించనుంది. వీటితో పాటు ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన ఫొటోలను మరింత జూమ్‌ చేసి తీసే వీలు కలుగుతుంది.

Last Updated : Nov 27, 2019, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details