నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థులు లేరనే కారణంతో మూడు కోర్సులను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే కోర్సుల్లో లేదా ప్రైవేటు కాలేజీలో చేరమంటున్నారని.. తమ పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. కాలేజీ ఎదుట వెంకటగిరి-తిరుపతి మార్గంలో రోడ్డుకు అడ్డంగా నిలబడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన కారణంగా రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చించి.. వారికి సర్దిచెప్పారు.
వెంకటగిరిలో ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కాలేజీ విద్యార్థుల ఆందోళన - Government Vishwodaya Degree College Venkatagiri news
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. తగినంత సంఖ్యలో విద్యార్థులు లేరని పలు కోర్సులు రద్దు చేయటాన్ని వారు వ్యతిరేకించారు.
విద్యార్థుల ఆందోళన