తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 23వ రోజుకు చేరాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనల్లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించటంతో పాటు కార్మికులపై వేధింపు చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సమస్యల పరిష్కారానికి పోర్టు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన - నెల్లూరు జిల్లా నేటి వార్తలు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
సమస్యల పరిష్కారానికి అర్ధనగ్న ప్ర