నెల్లూరు జిల్లా వాకాడు మండలం కొండూరు పాలెం, తూపిలిపాలెం సముద్ర ముఖ ద్వారం వద్ద మత్స్యకారులు నిరసన చేపట్టారు. ముఖ ద్వారం పూడిపోవడంతో ఉప్పుశాతం పెరిగి పొల్యూషన్ కారణంగా ఉప్పునీటి కాలువలోని చేపలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ ద్వారం లేకపోవడంతో చేపల వేట సాగించలేక ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 10 గ్రామాల మత్స్యకారులు వాపోయారు. సముద్రంలోనే తమ బోట్లను లంగరు వేసుకుంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రం చేపల వేటకు తమిళనాడు, కారైకల్ కు చెందిన బోట్లు రావడంతో చేపల వేట సాగించలేక పోతున్నామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు సముద్ర తీరం వద్దకు చేరుకొని ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సముద్ర ముఖ ద్వారం వద్ద మత్స్యకారుల ఆందోళన - protest of fishermen at the sea front gate
నెల్లూరు జిల్లాలో మత్య్సకారులు ఆందోళన చేపట్టారు. వాకాడు మండలంలోని సముద్ర ముఖ ద్వారం పూడిపోవడంతో ఉప్పుశాతం పెరిగి పొల్యూషన్ కారణంగా ఉప్పునీటి కాలువలోని చేపలు చనిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సముద్ర ముఖ ద్వారం వద్ద మత్స్యకారుల ఆందోళన