ప్రభుత్వం నుంచి తమకు రూ. 80 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని పశ్చిమగోదావరి జిల్లాలో 180 కళాకారుల కుటుంబాలకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులు జంగారెడ్డిగూడెంలో సమావేశమై వివిధ వేషధారణలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. సమాచార శాఖ భాష సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ కళాకారులు ప్రభుత్వ పథకాలపై ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సర కాలంలో రెండు దఫాలుగా ప్రదర్శనలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది కోట్ల వరకు ప్రభుత్వం నుంచి కళాకారులకు బకాయిలు అందాల్సి ఉంది అన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నేటికీ తమకు రావాల్సిన సొమ్ములు ఇవ్వడం లేదన్నారు. కరోనా కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వ అర్థం చేసుకుని తమకు అందాల్సిన సొమ్ములు చెల్లించాలని కళాకారులు డిమాండ్ చేస్తున్నారు.
'బిల్లులు చెల్లించాలని కళాకారుల నిరసన'
ముఖానికి రంగు పూసుకుని నలుగురికి వినోదాన్ని పంచే కళాకారుల జీవితం కరోనా సమయంలో కష్టతరంగా మారింది. ప్రభుత్వ పథకాలకు కళాకారులను ప్రచారకులుగా వాడుకుని వారికి ఇవ్వాల్సిన సొమ్ములు నేటికీ ఇవ్వకపోవడంతో అర్ధాకలి బాధతో రంగులు పూసుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు.
వివిధ వేషధారణలో నిరసన