వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని ఆరోపిస్తూ,నెల్లూరు లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. విడవలూరు మండలం రామతీర్థానికి చెందిన మమత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు.ప్రసవానికి ముందు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన వైద్యులు,తరువాత..పుట్టిన బిడ్డకు తలపై ఒత్తిడి పడటం వల్లే చనిపోయిందని చెబుతున్ననారని కన్నీటిపర్యం అయ్యారు.పసికందు మరణానికి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
పసికందు మృతి..ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా - ap latest
వైద్యుల నిర్లక్ష్యంతోనే అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని బంధువులు నెల్లూరులోని శ్రీ దుర్గ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.
ఆసుపత్రి వద్ద బంధువుల ధర్నా