ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాటర్​ ప్లాంట్​ బాగు చేయించాలని మహిళల ఆందోళన - krishnareddypalli latest news

నెల్లూరు జిల్లా కృష్ణారెడ్డిపల్లి గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేపట్టారు. వాటర్ ప్లాంట్​ను బాగు చేసి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

protest by women
ఆందోళన చేస్తున్న మహిళలు

By

Published : May 7, 2021, 4:34 PM IST

వాటర్ ప్లాంట్ బాగు చేసి ప్రజలకు మంచి నీరు అందించాలని డిమాండ్​ చేస్తూ.. నెల్లూరు జిల్లా కృష్ణారెడ్డిపల్లిలో మహిళలు ఆందోళన చేశారు. బిజ్జంపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురై 3 రోజులు కావస్తున్నా అధికారులు ఎవరూ స్పందించలేదని వాపోయారు. కుళాయి నుంచి వచ్చే కలుషిత నీరు తాగి రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాగేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేక తామంతా అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఐదు గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చే వాటర్ ప్లాంట్​ను తక్షణమే బాగు చేయించాలని మహిళలు డిమాండ్​ చేశారు. అధికారులు స్పందించకపోతే మండల కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details