ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు వద్దంటూ.. పోలీసులతో మహిళల వాగ్వాదం - latest news on wine shop issues in nellore

జన సమూహం మధ్య మద్యం దుకాణం తొలగించాలని నెల్లూరు జిల్లాలో పలుచోట్ల మహిళలు, స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వారితో స్థానికులు వాగ్వాదానికి దిగారు.

మద్యం దుకాణాలు వద్దంటూ పోలీసులతో వాగ్వాదం

By

Published : Oct 1, 2019, 7:22 PM IST

మద్యం దుకాణాలు వద్దంటూ పోలీసులతో వాగ్వాదం

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వద్దంటూ నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆత్మకూరు
పట్టణంలోని ఆర్టీసీ డిపో, బట్టేపాడు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను నిర్వహించకుండా మహిళలు అడ్డుకున్నారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా మహిళలు ససేమిరా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న లక్ష్మమ్మ అనే మహిళ అస్వస్థతకు గురవడం వల్ల ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎట్టకేలకు అధికారులు దుకాణాలను తాత్కాలికంగా మూసివేశారు.

ఉదయగిరి
ఉదయగిరిలోని బాలాజీనగర్​లో గతంలో ఉన్న మద్యం దుకాణం భవనంలో... ప్రభుత్వం నూతనంగా ప్రారంభిస్తున్న మద్యం దుకాణాలను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ విక్రయాలు మాత్రమే జరుగుతాయని... తాగేందుకు అనుమతి ఉండదని ఎక్సైజ్ పోలీసులు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా... స్థానికులు అంగీకరించలేదు. గతంలో మందుబాబుల ఆగడాలతో మహిళలు, చిన్నారులు భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. మద్యం దుకాణాలు ఇక్కడినుంచి తొలగించి గ్రామానికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్ వాడకంపై ఈటీవీ భారత్ - ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details