ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్టుబడి సైతం రావట్లేదని నిమ్మ రైతుల ఆవేదన - నెల్లూరు జిల్లా తాజా సమాచారం

నిమ్మతోటలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నిమ్మరైతులను అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్‌తో మార్కెట్‌ వ్యవస్థ లేక నిమ్మకాయలను అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి కష్టపడినా..ఫలితం లేదని రైతులు వాపోతున్నారు.

lemon farmers
నిమ్మ రైతుల ఆవేదన

By

Published : Jun 3, 2021, 10:05 PM IST

పెట్టుబడి సైతం రావట్లేదని రైతుల ఆవేదన

నెల్లూరు జిల్లా నిమ్మతోటలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే నిమ్మతోటలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో నిమ్మ రైతులు విలవిల్లాడుతున్నారు. పొదలకూరు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అంతరాష్ట్ర మార్కెట్లూ ఉన్నాయి. నిత్యం రైతులతో ఇవి కళకళలాడుతుండేవి. కానీ కరోనాతో ఆ పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి.

లాక్‌డౌన్‌తోపాటు, కొవిడ్ అంక్షలతో ప్రస్తుతం మార్కెట్లు మూసివేశారు. వారంలో 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే నిమ్మకాయలు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన రోజులు మార్కెట్‌ను మూసివేస్తున్నారు. రైతులు నిమ్మకాయలను తీసుకురావడానికి... మంచి ధరకు విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లా నుంచి దిల్లీ, మహారాష్ట్ర, కొల్‌కతా, గుజరాత్‌, బిహార్‌, యూపీ రాష్ట్రాలకు నిమ్మకాయలను ఎగుమతి చేస్తారు. ఏడాదికి రూ.300కోట్లకుపైగా ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో.. నిమ్మకాయలను దిగుమతి చేసుకోవడం లేదు. గత వేసవిలో కిలో నిమ్మకాయలు రూ.25నుంచి 30 ధర పలకగా.. ఈసారి రూ.ఐదు నుంచి 10 కూడా ధర పలకడంలేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వేసవిలో మంచి ధరలు వచ్చేవని.. లాక్ డౌన్​తో మార్కెట్‌ లేక తీవ్రంగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు.

ఎగుమతులు లేకపోవడమే ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రారంభం నుంచి నిమ్మకు ఎగుమతుల సమస్య తీవ్రంగా మారింది. పెట్టుబడి డబ్బులు కూడా రావడంలేదని రైతులు అల్లాడుతున్నారు.

ఇదీ చదవండి

Ayurvedam: మన జీవన శైలి మారాలా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

ABOUT THE AUTHOR

...view details