Problems at Tidco Housing Complex : టిడ్కో ఇళ్ల సముదాయంలో బాధితుల కష్టాలు ఇంకా తీరలేదు. ఐదేళ్ల కిందట టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు నాలుగేళ్ల తరువాత తాళాలు ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేశ్.. ఇళ్ల ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. కానీ, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యాన ఐదు నెలలుగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు గృహసముదాయంలో టిడ్కో లబ్ధిదారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. మంత్రి ప్రారంభించిన తరువాత జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో సమస్యలు వినేవారు లేరని బాధితులు వాపోతున్నారు.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు
Tidco Housing Complex:నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 300మందికి టిడ్కో ఇళ్ల సముదాయాన్ని నిర్మించింది. చక్కటి స్థలంలో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో పేదలకు ఇళ్లు నిర్మించారు. ఎన్నికలు రావడంతో గృహప్రవేశాల కార్యక్రమం వాయిదా పండిది. కాగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వకుండా నాలుగేళ్లు కాలం గడిపింది. నాలుగు నెలల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్.. ఆర్బాటంగా 300మందికి తాళాలను అందజేసి గృహప్రవేశాలు చేయించారు. స్వయంగా మంత్రి పాల్గొనడం, మిగిలిన సమస్యలను పరిష్కరిస్తారని చెప్పడంతో ఆశపడ్డారు. ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నాఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పెన్నా నది నుంచి నీటి వసతి కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. బోర్ల నుంచి ఇస్తున్న నీటిలో మట్టి, బంక ఉండటంతో చర్మవ్యాధులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. దూరప్రాంతంలో ఉన్నందున మినరల్ క్యాన్లను కొనడం ఆర్థికంగా భారంగా మారిందని వాపోతున్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో పాలకులకు రంగులు వేయటం మీద కలిగిన శ్రద్ధ మౌలిక సదుపాయాలు (Infrastructure) కల్పించటంలో కొరవడిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు, పైప్‌లైన్ లీకేజీ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.