సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో.. నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో క్రస్ట్ గేట్ల కంప్యూటర్ పరికరం మెురాయించింది. దీంతో మాన్యువల్‌గా గేట్లు ఎత్తటానికి ప్రయత్నించగా.. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జనరేటర్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగా... జనరేటర్లు సైతం మెురాయించాయి. దీంతో అధికారులు నానా అవస్థలు పడ్డారు. సుమారు గంట పాటు మరమ్మతులు చేసిన అనంతరం.. 6,7 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు.
సోమశిల జలాశయం నుంచి నీటి విడుదలకు ఆటంకాలు - water release from somashila reservoir
జలాశయంలోకి వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో.. నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తీరా గేట్లు ఎత్తే సమయానికి కంప్యూటర్లు మెురాయించింది.. మాన్యువల్‌గా విడుదల చేసేందుకు ప్రయత్నించగా కరెంటు పోయింది.
సోమశిల జలాశయం