నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బుధవాడ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గేదెను తప్పించబోయి బోల్తా కొట్టింది. బస్సులోని 12 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 12 మందికి గాయాలు - బుధవాడ వద్ద బస్సు ప్రమాదంలో 12 మందికి గాయాలు
కడప నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బుధవాడ జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బుధవాడ జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం
క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కడప నుంచి విశాఖపట్నం వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి:సుడిగాలి బీభత్సం.. 5 నిమిషాల పాటు మైదానంలో అయోమయం
TAGGED:
bus accident at budhavada