ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దయచేసి నన్ను కాపాడండి’.. కరోనా సోకిన ప్రధానోపాధ్యాయుడి ఆవేదన - నెల్లూరులో కరోనాతో ప్రధానోపాధ్యాయుడి మృతి

'నా పేరు రమేష్‌కుమార్‌. నేను మనుబోలు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. నాడు-నేడు కార్యక్రమంలో చురుగ్గా పనిచేసి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశంసలందుకున్నా. నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నేను ప్రభుత్వాసుపత్రిలో గంట నుంచి ఎదురుచూస్తున్నా. కలెక్టర్‌, డీఈవో, జేసీ, ఎమ్మెల్యే.. దయచేసి నన్ను కాపాడాలని రెండు చేతులెత్తి కోరుతున్నా. నన్ను చేర్చుకోండి. నేను మధుమేహం, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నా’.'

prinicapal died with corona in nellore
కరోనాతో ప్రధానోపాధ్యాయుడి మృతి

By

Published : Aug 13, 2020, 9:11 AM IST

కరోనా సోకటంతో 4 రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్‌లో చేరేందుకు వచ్చి, ఆందోళనతో ఓ ప్రధానోపాధ్యాయుడు విడుదల చేసిన వీడియో సారాంశమిది. ఈనెల 8న రాత్రి 10.45కి ఆసుపత్రికి వచ్చిన ఆయన.. గంటపాటు ఎదురుచూసి సంయుక్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి చెప్పారు. ఆయన వెంటనే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డిని అప్రమత్తం చేసి రమేష్‌కుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ 11వ తేదీ రాత్రి చనిపోయారు. బుధవారం ఉదయం అంత్యక్రియలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ హాజరయ్యారు.

సరైన వైద్యం అందకపోవడం వల్లే రమేష్‌ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు రావడం, వీడియో ప్రచారం కావడంతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌రెడ్డి స్పందించారు. ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయనను కాపాడేందుకు మూడు రోజుల పాటు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఇచ్చామని, 11న అపస్మారక స్థితికి చేరి చనిపోయారని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details