నెల్లూరు జిల్లాలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తుండటంపై పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాయుడుచెరువు గ్రామంలో బిల్లులు ఎక్కువగా వచ్చాయంటూ.. గ్రామస్థులు ట్రాన్స్ కో సిబ్బందిని నిలదీశారు.
ప్రతి నెల 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు.. ఇప్పుడు మూడు వేల దాకా ఎందుకు వస్తోందని అధికారులను ప్రశ్నించారు. ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే ఎలా కడతామన్నారు. కరోనా కష్ట కాలంలో సాయం చేయాల్సిన ప్రభుత్వమే.. ఇలా భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందారు.