కరోనా మహమ్మారి పారదోలంటూ గ్రామదేవతలకు పొంగళ్ళు
కరోనా మహమ్మారి పారదోలంటూ నెల్లూరు జిల్లా జగన్నాధరావుపేటలో గ్రామస్తులు గ్రామదేవతలకు పొంగళ్ళు సమర్పించారు. విగ్రహాలను పసుపు కుంకుమలతో అలంకరించారు. వ్యాధి తమ గ్రామానికి రాకుండా ఉండాలని వేడుకున్నారు.
poojalu-for-corona-in-nellore
మహమ్మారి పారదోలంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జగన్నాధరావుపేట వాసులు గ్రామదేవతలకు పొంగళ్ళు సమర్పించారు. నాగ దేవత విగ్రహాలను పసుపు కుంకుమలతో అలంకరించి విగ్రహం చుట్టూ ప్రదర్శన చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లోలమై పోయిందని ఆ వ్యాధి తమ గ్రామానికి రాకుండా ఉండాలని దేవతలను వేడుకున్నారు.