నెల్లూరు జిల్లాలోని నాయుడు పేటలో అన్నదాత ఫౌండేషన్ పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంక్రాంతి సంబరాలను వృద్ధాశ్రమంలో నిర్వహించారు. వృద్ధులకు చీరలను అందించి.. సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని విద్యార్థులు తెలిపారు.
వృద్ధాశ్రమంలో విద్యార్థుల సంక్రాంతి సంబరాలు - naidupeta sankranthi celebrations
చదవులు, వినోదాలకే తాము పరిమితం కాదని.. సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని నెల్లూరు జిల్లా విద్యార్థులు నిరూపిస్తున్నారు. అన్నదాత ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థులు.. మేరీ వృద్ధాశ్రమంలో చీరలు పంపిణీ చేశారు.
వృద్ధాశ్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంక్రాంతి సంబురాలు