నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో చెరువుకు గండిపడింది. నీరు పొలాల్లోకి ప్రవహించటంతో పంటలు కోతకు గురయ్యాయి. జిల్లాలో 1750 చెరువులు ఉండగా అందులో 1000 చెరువులు నిండాయి. కొన్ని చెరువుల కట్టలు దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..కలిచేడు చెరువుకు గండి
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో సుమారు వెయ్యి చెరువులు నిండగా..కొన్ని చెరువుల కట్టలు దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాయి.
కలిచేడు చెరువుకు గండి