NELLORE POLITICAL WAR : నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో.. రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై.. సీబీఐ విచారణ కోరడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఎందుకని వైకాపా రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. తన స్నేహితుడు రామశివారెడ్డితో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పిస్తే సరిపోతుందా అని నిలదీశారు. ఇదే సమయంలో.. నెల్లూరు రూరల్ వైకాపా కొత్త ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి విమర్శలపైనా.. కోటంరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోటంరెడ్డి ఆరోపణల్ని మంత్రి కాకాణి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తిప్పికొట్టారు.
నెల్లూరులో రాజకీయ రగడ.. నేతల మధ్య ఆగని మాటల యుద్ధం - మంత్రి కాకాణి
NELLORE POLITICAL WAR : నెల్లూరులో రాజకీయ రగడ కొనసాగుతోంది. నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు మాటల యుద్దాలు చేస్తున్నారు. తాజాగా కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి కాకాణి, నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తిప్పి కొట్టారు.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఊహించని పరాభవం: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘‘స్థానిక ప్రజాప్రతినిధులంతా వైసీపీతోనే ఉంటామన్నారన్నారు. కార్పొరేటర్లు అందరూ ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డితోనే ఉంటామని స్పష్టం చేసినట్లు తెలిపారు. కోటంరెడ్డి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వ్యాఖ్యానించారు. అది ట్యాపింగ్ కాదు.. ఆడియో రికార్డింగ్ అని కోటంరెడ్డికి తెలుసన్నారు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు. ఆదాల నేతృత్వంలో భారీ మెజారిటీతో వైసీపీ గెలుపు తథ్యం అని మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: