ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ATTACK : వృద్ధురాలిపై దాడి... పట్టపగలే బీభత్సం సృష్టించిన రాజకీయ నేత - news updates in nellore

నెల్లూరు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్(nellore) పరిధిలోని సంజయ్ గాంధీ నగర్​లో... వృద్ధురాలిపై ఓ నాయకుడు ప్రతాపం చూపించాడు. పట్టపగలే ఆమెపై విచక్షణారహితంగా దాడి(attack) చేశాడు. ఇదేమని ప్రశ్నించిన వారిని బెదిరించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు (police case) నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

వృద్ధురాలిపై దాడి
వృద్ధురాలిపై దాడి

By

Published : Jul 12, 2021, 10:41 PM IST

వృద్ధురాలిపై దాడి

నెల్లూరు సంజయ్​గాంధీ నగర్​లో నివాసముంటున్న ఓ వృద్ధురాలి స్థలంపై (land).. ఓ రాజకీయ నేత (political leader) కన్నేశాడు. వృద్ధురాలిపై తన అనుచరులతో దాడి చేయించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులను సైతం బెదిరించాడు.

ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితురాలు.. అత్యంత విలువైన తన స్థలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకే ఈ దాడులకు పాల్పడ్డారని నేతలు వాపోయారు. ఈ ఘటనపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా... పోలీసులు మాత్రం కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details