పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడురులో మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితులను గూడురు పోలీసులు అదుపులోకి తీసుకున్నామని సీఐ వంశీధర్‌రావు తెలిపారు. ఈ నెల 5న... మానసిక వికలాంగురాలు రాత్రి 8.30 సమయాన ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా... నిందితులు ఆమెను పాడు పడిన భవనంలోకి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఆపై హత్య చేశారని గూడూరు సీఐ తెలిపారు. సంఘటనా స్థలంలో దొరికిన కత్తి ఆధారంగా కేసును ఛేదించామని వెల్లడించారు. ఈ కేసులోని ఏ1 గా ఉన్న సాయి గతంలోనూ ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మిగిలిన నిందితులు వంశీ, మధు, వెంకటేష్, శరత్‌లను అదుపులోకి తీసుకున్నారు.
హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు - నెల్లూరు జిల్లా తాజా క్రైమ్ వార్తలు
నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన హత్యాచారం కేసును గూడూరు పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేని యువతి పట్ల పశువుల్లా ప్రవర్తించిన మృగాళ్లను పట్టుకున్నారు. ఘటనాస్థలంలో దొరికిన చిన్న ఆధారంతో వారిని గుర్తించారు.
హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు