ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder Csae Revealed: ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య..! - ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య వార్తలు

Police Revealed Murder Case: నెల్లూరు నగరం జనార్దన్ రెడ్డి కాలనీలో డిసెంబరు 9న జరిగిన హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య
ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య

By

Published : Dec 19, 2021, 10:07 PM IST

Police Revealed Murder Case: నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో డిసెంబరు 9న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. నగర డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్, కుద్దుష్​నగర్​కు చెందిన ఓ యువతి గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. వారి ప్రేమను అంగీకరించని యువతి అన్నదమ్ములు.. మరో ఇద్దరు బయట వ్యక్తుల సాయంతో పెన్నా పొర్లుకట్ట వద్ద ఈనెల 9న అల్తాఫ్​ను దారుణంగా పొడిచి చంపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి ఫోన్ కాల్స్, ఇతర ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించారు. కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details