ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. రక్షించిన కానిస్టేబుల్ - Woman commits suicide in Somshila reservoir

కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. వెంటనే స్పందించిన ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించాడు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద ఈ ఘటన జరిగింది.

Woman attempted suicide
మహిళ ఆత్మహత్యాయత్నం

By

Published : Aug 4, 2021, 4:03 PM IST

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో దూకి బలవన్మరణానికి యత్నించిన ఓ మహిళను కాపాడిన పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. కలువాయికి చెందిన లక్షమ్మ అనే మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని సోమశిల జలాశయంలో దూకింది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన సోమశిల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేణు.. అక్కడికి చేరుకున్నాడు. వెంటనే నీటిలోకి దూకి ఆమెను రక్షించాడు. లక్షమ్మను పోలీస్​ స్టేషన్ కు తీసుకెళ్లి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వేణును అందరూ శభాష్ అని మెచ్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details