నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. గ్రామనత్తం సమీపంలో పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు కార్లు, 11 మోటార్ సైకిళ్లు, 18 సెల్ ఫోన్లు, 45వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లాతోపాటు ఒంగోలు, శ్రీకాళహస్తి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నట్లు కొడవలూరు ఎస్.ఐ. జిలానీ బాషా తెలిపారు. గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేసి, పేకాటరాయుళ్లను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.