తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇడిమేపల్లి భూమికి సంబంధించిన వివరాలు, పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలని వెంకటాచలం పోలీసులు కోరారు. నోటీసును స్వీకరించిన సోమిరెడ్డి భూమికి సంబంధించి 1933 సంవత్సరం నుంచి పూర్తి వివరాలు అందజేస్తామని పోలీసులకు తెలిపారు. ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పటివరకు అలాంటి పనులు తమ కుటుంబంలో లేవని అన్నారు. మొదట విదేశాల్లో వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారని... చివరకు ఇడిమేపల్లిలో రెండుఎకరాలకు దిగారని ఎద్దేవా చేశారు. తనపై కేసులు వేసిన వారు పశ్చాత్తాప పడక తప్పదని పేర్కొన్నారు.
అలాంటి పనులు మా కుటుంబంలో లేవు: సోమిరెడ్డి - tdp
తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనపై నమోదైన ఓ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని సోమిరెడ్డి తెలిపారు.
సోమిరెడ్డి
ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 2.40 ఎకరాల తన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని 2017 ఏప్రిల్ 6న వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి మాజీమంత్రి సోమిరెడ్డిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అదేశాల మేరకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై గత నెలలో కేసు నమోదైంది.
Last Updated : Sep 7, 2019, 1:33 AM IST